ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

17-10-2026 | 03:17pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అందించే మద్దతు ధరను అందించడమే లక్ష్యంగా అచ్చంపేట సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించారు. డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్   సహకార సంఘ అధ్యక్షులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి,కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను లాంఛనంగా మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, దళారులను ఆశ్రయించి నష్టపోకుండా రైతులు ఈ కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర  ధాన్యం నాణ్యతను బట్టి రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందని స్పష్టం చేశారు.

తేమ శాతం లేకుండా, నిబంధనల ప్రకారం శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి  స్థానిక ప్రజాప్రతినిధులు, సహకార సంఘం డైరెక్టర్లు, అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు