పేదల పెన్నిధి పండుగ సాయన్న
తరిగొప్పుల, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తరిగొప్పుల మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు సుంకరి నరసింహులు, మత్స్య కార్మిక శాఖ అధ్యక్షుడు పండుగ కనకయ్య ఆధ్వర్యంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి ఉత్సవాలను (Birth Anniversary Celebrations) ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ముదిరాజ్ ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ అయిన పండుగ సాయన్న నిజాం పాలనలో బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని నాయకులు కొనియాడారు. దొరల గడీల నుంచి సంపదను తీసుకొచ్చి పేదలకు, సబ్బండ వర్గాలకు పంచిన మహావీరుడని పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి చిలివేరు లింగం, ముదిరాజ్ సంఘం పెద్దమనిషి కలకుంట్ల రాజు, తరిగొప్పుల ఉపసర్పంచ్ చిలువేరు మహేందర్, చిలివేరి సంపత్, మత్స్య కార్మిక శాఖ ఉపాధ్యక్షుడు సుంకరి కనకరాజు, కార్యదర్శి కలకుంట్ల సాంబరాజు, సుంకరి వెంకటేష్, నందనబోయిన యాదగిరి, కలకుంట్ల రాజేందర్, సుంకరి హరికృష్ణ, కలకుంట్ల బాపురాజు, సుంకరి కుమార్, చిలివేరి సతీష్, భాషబోయిన బాలరాజ్, దాసరి రవి, భాషబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.