5 September, 2026 | 6:39 PM

హామీలన్నీ బాకీలేనా..? జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీత

05-09-2026 | 05:17pm

జనగామ సెప్టెంబర్ 5(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో నీ ఆర్టీసీ చౌరస్త వద్ద శాసనసభ్యులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...100 రోజుల్లో 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. మాట తప్పరు, మడమ తిప్పరు అన్నారు. ఇప్పుడు 1000 రోజులు దాటింది. ఏమైంది ఆ హామీలు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ఒక్కొక్కటిగా లెక్క చెప్పారు..

రైతుబంధు రూ.15 వేలు ఎక్కడ? కౌలు రైతుకు సాయం ఏది? రూ.2 లక్షల రుణమాఫీ(Loan Waiver) ఏమైంది? రైతు కూలీకి రూ.12 వేలు ఇచ్చారా? వరికి రూ.500 బోనస్ వచ్చిందా? ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇచ్చారా? తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ సంగతేంటి? అన్నీ బాకీలే కదా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి, ఇప్పుడు వెయ్యి రోజులైనా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు" అని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్వతాలు, సురేష్ రెడ్డి, ప్రేమలత రెడ్డి, జమున, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు