వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలి

16-10-2026 | 08:18pm
  1. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులకు ఇబ్బందులు..
  2. తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి డిమాండ్.

కోరుట్ల,అక్టోబర్ 16(విజయ క్రాంతి): వ్యవసాయ పంటలు(Agricultural crops) చేతికొచ్చే కీలక సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలు, తీవ్ర లో-వోల్టేజీ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే నాణ్యమైన విద్యుత్(Quality electricity) సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని(State government) డిమాండ్ చేశారు. 

కోరుట్లలో శుక్రవారం తెలంగాణ రైతు ఐక్యవేదిక నాయకులు మామిడి నారాయణరెడ్డి, గురిజెల రాజారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పంటలు పక్వానికి వచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులకు విద్యుత్ సమస్యలు 

తీవ్ర లో-వోల్టేజీ కారణంగా వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని, వాటి మరమ్మతులకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని తెలిపారు. ప్రతిరోజూ విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.పంటలు చేతికొచ్చే వరకు అప్రకటిత విద్యుత్ కోతలు విధించకుండా, మోటార్లు దెబ్బతినకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

లో-వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విద్యుత్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శేర్ నర్సారెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు