హైదరాబాద్ 2035' సదస్సును నిర్వహించిన ఫిక్కీ
హైదరాబాద్, ఇండియా – సెప్టెంబర్ 10, 2026: నాలెడ్జ్ పార్టనర్ అనరాక్ భాగస్వామ్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(Federation of Indian Chambers of Commerce and Industry) "ఫిక్కీ ఇండియా నెక్స్ట్ గ్రోత్ ఫ్రాంటియర్: హైదరాబాద్ 2035: ఇండియాస్ గ్లోబల్ కేపబిలిటీ క్యాపిటల్" అనే సదస్సును నిర్వహించింది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ), సాంకేతిక ఆవిష్కరణలు మరియు క్రాస్-సెక్టార్ వృద్ధికి దేశంలోనే అగ్రగామి కేంద్రంగా నగర ఎదుగుదలను వివరిస్తూ రూపొందించిన "హైదరాబాద్ - ది రైజ్ ఆఫ్ ఎ గ్లోబల్ కేపబిలిటీ పవర్‌హౌస్" అనే నాలెడ్జ్ నివేదికను ఈ కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేశారు.2026 ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో 5.2 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య స్థలం లీజు/విక్రయాల ద్వారా వినియోగంలోకి వచ్చిందని, ఇందులో మార్కెట్ వాటాలో 40 నుండి 45 శాతం వరకు జీసీసీలే ఆక్రమించాయని టెర్మినస్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్.పి. రెడ్డి వెల్లడించారు. ఈ వాణిజ్య వృద్ధి కారణంగా నివాస గృహాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి 23,700 యూనిట్లకు చేరుకున్నాయన్నారు.
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్, గజ ఇంజనీరింగ్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.వి. రామరాజు తమ ప్రసంగంలో మాట్లాడుతూ, ఈ ప్రాంతంపై జీసీసీలు చూపుతున్న ఎకనామిక్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 500కి పైగా జీసీసీలు ఉన్నాయని, వీటిలో 3,00,000 మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారని, ఇది భారతదేశపు జీసీసీ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతంగా ఉందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
వస్తున్న అంతర్జాతీయ పెట్టుబడులు వాణిజ్య లీజింగ్, నివాస గృహాల డిమాండ్ మరియు రిటైల్ వృద్ధికి ప్రత్యక్షంగా ఎలా ఊతమిస్తున్నాయో శ్రీ రామరాజు వివరించారు.1.4 బిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి విస్తీర్ణంతో నగరం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తోందని, తద్వారా అగ్రశ్రేణి అంతర్జాతీయ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా హైదరాబాద్ నిలుస్తోందని అనరాక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పియూష్ జైన్ తెలిపారు.
జీసీసీ విస్తరణ ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై పడుతున్న ముద్ర గురించి పరిశ్రమ దిగ్గజాలు చర్చిస్తూ, ఆక్యుపైయర్ వ్యూహంలో వస్తున్న నిర్మాణాత్మక మార్పులను పరిశీలించారు. చర్చల తీరు ప్రాథమికంగా మారిపోయిందని, పరిశ్రమ నాయకులు పిలిచే 'బీహెచ్పీ ట్రయాంగిల్' (బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణే) లో బెంగళూరుతో పాటు కొత్త జీసీసీల రాకలో హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు.వ్యాపార సంస్థలు రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే 500 సీట్ల స్థాయి నుండి వేల సంఖ్యకు వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పారు.