ఉట్నూరులో మోడీ జన్మదినోత్సవం..
17-09-2026 | 07:18pm
ఉట్నూర్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 76వ జన్మదినం సందర్భంగా వికాసం పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం బిజెపి నాయకులు నిర్వహించారు. గురువారం భారతీయ జనతా పార్టీ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు తన్నీరు సతీష్, కార్యదర్శి కొండేరి రమేష్, సీనియర్ నాయకులు సడిగే గంగన్న బానోత్ జగన్, లింగా గౌడ్ కిషన్, పటేల్ శేషారావు కిరణ్ రమణ గంగాధర్ ఉగ్గే విజయ్ వేణు మహేందర్ కనక విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.