ప్రజాపాలన స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

17-09-2026 | 08:58pm

రాచరికం నుంచి ప్రజాపాలనకు సెప్టెంబర్‌ 17 నాంది: గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌(Yadadri Bhuvanagiri District Collectorate) ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు(Telangana prajapalana dinotsavam celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం జరిగిన పోరాటాలకు ఇది ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి పెట్టాలి:

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukhender Reddy) మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోందని తెలిపారు. దేశంలో అవసరమైన ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిని పెంచితే ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించవచ్చన్నారు.

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఎస్పీ అక్షాంష్‌ యాదవ్‌, అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీవాణి, గ్రంథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఆర్‌ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు