శాంతి భద్రతలే లక్ష్యం

01-10-2026 | 12:18pm

హుజూర్‌నగర్,సెప్టెంబర్ 30: ప్రజల నుంచి వచ్చే ప్రతి పిటిషన్‌ను సీసీటీఎన్‌ఎస్‌ (CCTNS)లో నమోదు చేసి, సత్వరమే పరిష్కరించాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన రికార్డులను (Records) తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు.మహిళలు,చిన్నారుల భద్రతకు (Women & Child Safety) అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనల (Traffic Rules) ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల (Pending Cases) దర్యాప్తును వేగవంతం చేయాలని, కోర్టు కేసులు, వారెంట్లు, హాజరును నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.

స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల (CCTV Cameras) పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఎస్‌ఐలతో కలిసి మొక్కను నాటారు. నాటిన మొక్కను సంరక్షించాలని సిబ్బందికి సూచించారు.ఈ తనిఖీల్లో సీఐ చరమందరాజు, ఎస్‌ఐలు నరేష్, హనుమాన్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు