ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
ముకరంపుర, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి పార్టీ కరీంనగర్ నగరంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(City Mayor Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్ఖానగడ్డలోని ప్రభుత్వ వయో వృద్ధుల మరియు దివ్యాంగుల వసతి గృహంలో 53వ డివిజన్ కార్పొరేటర్ కొంపెల్లి శ్వేత-రామణ్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అనంతరం, కిసాన్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రధాని మోదీకి ఉత్సాహంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.