అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని(Praja Palana Day) పురస్కరించుకుని కొత్తగూడెంలోని DFO కార్యాలయం, వనవిహార్ లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీ బాబు, FDO (WLM), కొత్తగూడెం , రామవరం రేంజ్ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ ప్రాధాన్యతను స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య విలువలు, ప్రజాసేవ, పరిపాలనా బాధ్యతలపై అవగాహన కల్పించారు.
జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, IFS మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణలో ప్రభుత్వ శాఖల బాధ్యత ఎంతో కీలకమని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావం, నిజాయితీ, పాటించాలని సూచించారు. ప్రకృతి సంపదను కాపాడటం, భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం మనందరి సమిష్టి బాధ్యత. ప్రజలతో సమన్వయంతో పనిచేస్తూ అటవీ, వన్యప్రాణి, జీవవైవిధ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తాం”* అని DFO పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.