Breaking News

సోనాల మండల కేంద్రంలో టీఎల్ఎం మేళా

18-09-2026 | 05:44pm

బోథ్. సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి) సోనాల మండల కేంద్రంలో శుక్రవారం టిఎల్ఎం బోధన ఉపకరణ (TLM - Teaching-Learning Material)తయారీ పై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల ఇచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని వారు తయారుచేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు.

సైన్స్ మోడల్స్ గణిత పరికరాల సార్టులు మ్యాపులతోపాటు బోధన సామాగ్రిని ప్రదర్శించారు. విద్యార్థులలో మేధాశక్తిని పెంపొందించేందుకు మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు