పేదరికం జయించి ఎంబిబిఎస్ సీటు
చిన్న చిన్న కరెంటు పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించిన నాన్న
మాగనూరు: మాగనూరు మండల(Maganur Mandal) కేంద్రానికి చెందిన బులిమిని మాధురి చదువుకుంటూనే మరోవైపు తల్లిదండ్రుల కష్టానికి తాను తోడుగా ఉంటూ డాక్టర్ కావాలని లక్ష్యాన్ని సాధించుకుంది. మాధురి ఎంబిబిఎస్ సీటు(MBBS Seat) సాధించి శభాష్ అనిపించుకుంటుంది. మాగనూరు మండల కేంద్రానికి చెందిన బులిమిని మాధురి కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించి పేదరికం అనేది దేనికి అడ్డు కాదని ఏదైనా సాధించాలని దృఢ సంకల్పం ఉంటే చాలు మన కలలను సాకారం చేసుకోవడానికి మన నమ్మకమే నిజమైన బలం అంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిoది.
ఆ యువతి మాగనూరు గ్రామానికి చెందిన బులిమిని ఆంజనేయులు కుమార్తె బులిమిని మాధురి, బులిమిని మాధురికి వనపర్తి ఇనిస్ట్యూట్ లో ఫ్రీ మెడికల్ సీటు సంపాదించి శభాష్ అనిపించుకుంటుంది. తండ్రి ఆంజనేయులు వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకుంటూ చిన్నచిన్న కరెంటు పనులు రిపేరు లు నిర్వహిస్తున్నాడు, తల్లి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది. మాధురి గ్రామంలో ఏడవ తరగతి వరకు చదివి ఎనిమిదవ తరగతి మక్తల్ ప్రైవేట్ పాఠశాలల లో చదివి, ఇంటర్మీడియట్ మహబూబ్నగర్లోని గురుకుల కళశాలలో విద్యాభ్యాసం చేసింది. ఎంబిబిఎస్ సీటు సాధించిన బులిమిని మాధురిని గ్రామస్తులు అభినందించారు.