calender_icon.png 16 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభ ఎన్నికలపై జుకర్‌బర్గ్ రాంగ్ స్టేట్‌మెంట్

16-01-2025 02:21:24 AM

* విమర్శలు వెల్లువెత్తడంతో ‘మెటా’ క్షమాపణలు

న్యూఢిల్లీ, జనవరి 15: గతేడాది పలు దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని అధికార పార్టీలు పాలనా పగ్గాలు పోగొట్టుకున్నాయని ఇటీవల ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆయా దేశాల్లో భారత్ ప్రస్తావన కూడా ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

జుకర్‌బర్గ్ మాటలు కొన్ని దేశాలకు వర్తిస్తాయి. కానీ.. భారత్‌లో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. వరుసగా మూడోసారి పాలన పగ్గాలు చేజిక్కించుకున్నది. దీంతో కేంత్ర మంతి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా జుకర్‌బర్గ్‌పై విరుచుకుపడ్డారు. ‘భారత ప్రజలు ఎన్డీఏ కూటమిపై ఉన్న నమ్మకంగా వరుసగా మూడుసార్లు అధికారం కట్టబెట్టారు.

ఆ విషయాన్ని గుర్తించకుండా జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రితో పాటు అనేక మంది జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరోవైపు పార్లమెంటరీ కమిటీ సైతం జుకర్‌బర్గ్‌కు సమన్లు పంపేందుకు సిద్ధమైంది. దీంతో మెటా కంపెనీ బృందం దిగివచ్చి క్షమాపణలు చెప్పింది.