calender_icon.png 20 September, 2024 | 8:47 AM

పనిచేస్తే ప్రశంసలు.. లేకపోతే చర్యలు

19-09-2024 05:51:38 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అధికారులు నిబద్ధతతో పనిచేస్తే ప్రశంసలు వస్తాయని లేకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో కలిసి జెడ్పి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శాఖల వారీగా చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే రిపోర్టును అందజేయాలి నామమాత్రంగా  నిర్వహిస్తే కుదరదని స్పష్టం చేశారు.

మత్స్యశాఖ అధికారులు చేపల పంపిణీ సిద్ధంగా ఉండాలని సూచించారు మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు గ్రామాలలో సానిటేషన్ పై దృష్టి సారీంచి ప్రజలు  అనారోగ్యం బారిన పడకుండా చూడాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో చేపడుతున్న రక్త నమూనాల రిపోర్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని డీఎంహెచ్ఓ ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ నివారణలు భాగంగా మహిళా సంఘాలకు పేపర్ ప్లేట్స్, గ్లాస్, బ్యాగుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పించాలన్నారు.

ఇటీవల కురిసిన వర్షాలతో జరిపిన రోడ్డుల మరమ్మత్తులు, నష్టపోయిన బాధితుల వివరాలను సేకరించి నివేదిక అందించాలని సూచించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రతి బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రత్యేక అధికారులు కృషి చేయాలని తెలిపారు. మోడల్ మండలాలుగా తీర్చిదిద్దాలంటే ప్రతి అధికారి పట్టుదలతో పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ... ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామాల పాలన పడకేసిందన్నారు.

మూడంచల వ్యవస్థ జిల్లాలో పనిచేయడం లేదని ఆలోచించాలి. పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించడంతోనే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. వ్యాధులపై వైద్య శాఖ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మెడికల్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అటవీశాఖ అనుమతులు రాక రోడ్డు నిర్మాణ పనులు అవకాశం ఉందన్నారు. దిందా రోడ్డు, కొత్తిమీర నుండి దైగాం రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని లేకపోతే సదరు కాంట్రాక్టు మార్చాలని అధికారులకు సూచించారు. బెజ్జూర్ సహకార సంఘం లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వెంటనే విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ కోరారు. సమాజంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.