29-04-2025 09:52:52 PM
ఏ గ్రామంలోనైనా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం.. ఘర్షణ వాతావరణం..
జాబితా తయారిలో అధికారుల పాత్ర శూన్యం..
జాబితాను పునఃపరిశీలించాలని జడ్పీ సీఈఓకు ఫిర్యాధుల వెల్లువ...
పెన్ పహాడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానంగా కూడు, గూడు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. అందులో భాగంగానే 'ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించింది. స్వంత జాగా ఉండి గూడు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం మూడు విడుతలలో ఆర్ధిక సహాయం అందించనున్నది. ప్రభుత్వం లక్ష్యం దేశం గర్వించదగ్గ పథకమై ఉండగా స్థానిక నాయకుల వర్గ పోరు.. జాబితా తయారిలో అధికారుల పాత్ర లేక పోవడం..కమిటీ ఇష్టారాజ్యం.. అక్రమ వసూలే 'ఇందిరమ్మ ఇళ్ల పథకం పక్కదారి పడుతుందనే ఆరోపనలు వెలువడుతున్నాయి.
ఇదీ వరిస్థితి..
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లో 29 గ్రామాలు ఉండగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 11689 మంది లబ్దిదారులు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇందులో 4642 మంది మండల వ్యాప్తంగా అర్హులుగా పేర్కోంటూ ఆయా గ్రామాల వారిగా అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డుకు, గ్రామ జాబితా తయారి కమిటీకి అందజేశారు.
ఎల్-1 లో 663 మంది లబ్దిచారులు..
ప్రభుత్వ ఆదేశానుసారం అర్హుల జాబితా వివరాలను ఎల్-1, ఎల్-2, ఎల్-3 ప్రకారం మండల వ్యాప్తంగా జాబితాను తయారు చేసింది. అందులో భాగంగానే 4642 మంది జాబితా ప్రకారం మండలం లో ఎల్-1 లో 683 మంది అర్హులుగా గుర్తించారు. వీరంతా ఇల్లు లేకుండా స్థలాలు ఉన్న వారికే ఎల్-1లో ప్రధాన్యత ఉంది.
నామ్స్ కు విరుద్ధంగా జాబితా.. కమిటీ వాళ్లదే ఇష్టారాజ్యం...
ఆయా గ్రామాలలో 7గురితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఈకమిటీలో పంచాయతీ కార్యదర్శితో పాటు మిగితా సభ్యులంతా దాదావు అధికారి పార్టీ కనుసైగలో ఏకగ్రీవ లిస్టు తయారు చేసుకొని ఎన్నుకోబడ్డారని ఆరోవనలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారిలో ప్రభుత్వం బేషరతుగా నామ్స్ పొందపరిచింది. ఈనామ్స్ కమిటీకి, నాయకులకు గిట్టదు. వారి చెప్పిండే వేదం ..వారి చేసేదే తుది జాబితా . కమిటీ చేతి లో తుది జాబితా ఇష్టారాజ్యంగా తయారు కావడంతో నిజమైన ఆర్హులకు 'మొండి చెయ్యి' మిగిలింది.
సంవన్నలకే పట్టం.. పేదలకు మొండి 'చెయ్యి'
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..అన్నట్టుగా ఉంది. ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా ప్రభుత్వ నామ్స్ కు విరుద్దంగా ఉందని నిజమైన పేదలకు ఆపథకం మొండి చెయ్యి చూపిందని పలువురు ఆరోపిస్తున్నారు. అడవిలోభూములు..ఊళ్లో, పట్టణాలలో ఇళ్లు ఉన్న వారికే తిరిగి ఇందిరమ్మ ఇళ్ళు దక్కిందని గ్రామాలలో ఇండ్లు రాని పేదలు దీనంగా పేర్కోంటూ ప్రభుత్వం సొమ్ము పేదలకు దరి చేరదని పరోక్షంగా గ్రామాలలో ఉన్న నాయకులపై పేదవిరుస్తున్నారు. అధికంగా అర్హుల జాబితాలో కమిటీ సభ్యులు, కమిటీ కుటుంబ సభ్యులు, వారికి అనుకూలమైన వారి పేర్లు మాత్రమే జాబితాలోపొందవర్చారనే ఆరోవనలు వాస్తవం అని గ్రామస్థులు, ప్రతివక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.
కొన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు జాబితా లో పేరు రావాలంటే పెద్ద సార్లకు కొద్దో గొప్పో ముట్టజెప్పాల్సి వస్తుందని లబ్దిదారుల నుంచి కమిటీ అక్రమ వసూలకు పాల్పడుతున్నట్లు ఆరోవనలు మిన్నంటుతున్నాయి. ఇదంతా వంచాయతీ కార్యదర్శులు మాకెందుకు వచ్చిన తలనొప్పి అని గ్రామ కమిటీకి జాబితా ఒప్ప చెప్పడంతో ఈ పథకం లక్ష్యం ఆదిలోనే తారుమారై కావడం తో పేదల ఆశలు ఆవిరి పోయిందని బాధితులు బోరున విలపిస్తున్నారు. దీంతో పేద ప్రజల ఆశలు.. ప్రభుత్వ లక్ష్యం తూట్లు పొడుచుతున్నారని ఆరోవనలు వస్తున్నాయి.
జాబితా విషయంలో ఏలాంటి ఫిర్యాధులు అందలేడు (ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు)
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా విషయం లో నిష్పక్షపాతంగా జాబితా రూపొందించామని గ్రామాల నుంచి ఎ లాంటి ఫిర్యాధులు అందలేదు. ప్రభుత్వ నామ్స్ ప్రకారం నిజమైన అర్హులకే మొదటి విడుతలో అనర్హల పేర్లు జాబితాలో ఉంటే వెంటనే పునఃపరిశీలించి జాబితా నుంచి తొలగిస్తాం. నిజమైన అర్హులకు న్యాయం చేస్తాం.