calender_icon.png 18 April, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడిబాట ఫ్లెక్సీ, కరపత్రం, క్యాలెండర్ లతో జడ్పీ బాయ్స్ హై స్కూల్ ముందస్తు ప్రచారం

09-04-2025 07:46:36 PM

కోదాడ: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు "బడిబాట" కార్యక్రమాన్ని ప్రాథమిక పాఠశాల నయా నగర్ నుండి ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో తమ పాఠశాలలో ప్రవేశం పొందవలసిందిగా కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పైసా ఖర్చులేని నాణ్యమైన విద్యను పొందాలని కోదాడ మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి. సలీం షరీఫ్ కోరారు. 2024-25 విద్యా సంవత్సరంలో తమ పాఠశాలలో జరిగిన వివిధ విద్యాసంబంధమైన కార్యక్రమాల వివరాలను, పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ప్రత్యేకతలను కరపత్రం రూపంలో ముద్రించి, విద్యార్థులకు ఉపాధ్యాయులకు వివరించి ప్రచారం కొనసాగిస్తున్నారు. బడిబాట ర్యాలీ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ .హరిప్రసాద్ పాల్గొన్నారు.