* కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్ల్లీ: ప్రముఖ పుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమోటో లిమిటెడ్ కంపెనీ పేరు మారింది. ఇకపై ఎటర్నల్ లిమిటెడ్‌గ్గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన కొత్త లోగోను ఆవిష్కరించారు. రెండేళ్లుగా ఇదే పేరును అంతర్గతంగా వాడుతూ వస్తున్న ఆ సంస్థ.. తాజాగా పేరు మార్చింది. ఈ మేరకు వాటాదారులకు కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురువారం లేఖ రాశారు.
బ్లింకిట్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి జొమాటోను తాము ఎటర్నల్‌గా వ్యవహరిస్తూ వచ్చామని దీపిందర్ తన లేఖలో పేర్కొన్నారు. కంపెనీకి బ్రాండ్/యాప్ మధ్య వ్యత్యాసం ఉండాలన్న ఉద్దేశంతో ఈ పేరు మార్పు చేపట్టినట్లు తెలిపారు. ఇకపై జొమాటో లిమిటెడ్ కాస్త ఎటర్నల్ లిమిటెడ్ మారుతుందన్నారు.
జొమాటో బ్రాండ్, యాప్ పేరులో ఎలాంటి మార్పూ ఉండబోదని చెప్పారు. ఈ మేరకు పేరు మార్పునకు బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. వాటాదారులు దీనికి సహకరించాలని కోరారు. ఇకపై తమ కార్పొరేట్ వ్బుసైట్ జొమాటో.కామ్ నుంచి ఎటర్నల్.కామ్‌కు మారుతుందన్నారు. స్టాక్ టిక్కర్ సైతం జొమాటో నుంచి ఎటర్నల్‌కు మారుతుందని చెప్పారు.