బంగ్లాతో ఐదో టీ20
మీర్పూర్: సొంతగడ్డపై జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేయాలని భావించిన బంగ్లాదేశ్‌కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదో టీ20లో జింబాబ్వే జట్టు 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మహ్మదుల్లా (44 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. జింబాబ్వే బౌలర్లలో బెన్నెట్, ముజరబానీలు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సికందర్ రజా (46 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. బ్రియాన్ బెన్నెట్ (49 బంతు ల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి న బెన్నెట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా.. తస్కిన్ అహ్మద్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 4 కైవసం చేసుకుంది.