బులవాయో: పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో జింబాబ్వే 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సల్మాన్ అగా (32) టాప్ స్కోరర్. తయాబ్ తాహిర్ (21) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 2 వికెట్లు తీయగా.. మసకద్జ, నగరవా, మపోసా, రియాన్ బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరింది. బ్రియాన్ బెన్నెట్ (43) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒక దశలో 112కే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జింబాబ్వేను మపోసా (12*) గెలిపించాడు. బ్రియాన్ బెన్నెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు, సుఫియన్ మక్వీమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించాయి. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ 2 దక్కించుకుంది.