డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం
బులావాయో: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్ ఆ చేదు అనుభవాన్ని మరిచిపోకముందే జింబాబ్వే షాకిచ్చింది. సొంతగడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో జింబాబ్వే పాకిస్థాన్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 80 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. నరావా (48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆల్‌రౌండర్ సికందర్ రజా (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 125కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జింబాబ్వేను రజా, నరావా ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.
అనంతరం బరిలోకి దిగిన పాకిస్థాన్ 21 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో మ్యాచ్‌కు అడ్డు తగిలిన వరుణుడు ఎంతకీ తెరిపినివ్వలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జింబాబ్వే విజయం సాధించినట్లు అంపైర్లు పేర్కొన్నారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది.