అఫ్గానిస్థాన్‌తో తొలి టెస్టు
బులవాయో: స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జింబాబ్వే పటిష్ఠ స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న జింబాబ్వే తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (161 బంతుల్లో 145 నాటౌట్), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (56 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అంతకముందు ఓపెనర్ బెన్ కర్రన్ (68) అర్థశతకంతో రాణించగా.. టకువనాషె కైటానో (46) రాణించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో గజన్‌ఫర్ 2, నవీద్ జర్దన్, జహిర్ ఖార్ చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌ను 2 నెగ్గిన అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌ను 2 కైవసం చేసుకుంది.