న్యూఢిల్లీ, అక్టోబర్ 29: జిహాదిస్ట్ గ్రూప్ బోకో హారామ్.. మధ్య ఆఫ్రికా దేశమైన చాద్‌లో మిలిటరీ యూనిట్‌పై చేసిన ఆకస్మికదాడిలో దాదాపు 40మంది సైనికులు మృతిచెందగా పలువురు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఉండే చాద్ లేక్ ప్రాంతంలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న బోకోహరమ్ ఉగ్రవాదులు ఆదివారం అర్థరాత్రి 200మందికి పైగా సైనికులు ఉన్న చాద్ మిలిటరీ యూనిట్‌పై దాడిచేశారు. సోమవారం ఉదయం ఘటనాస్థలిని సందర్శించిన చాద్ అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డెబీ ఇట్నో మాట్లాడుతూ.. ‘బోకోహరామ్ ఉగ్రవాదులు చేసిన దాడుల్లో దేశానికి చెందిన 40మంది సైనికులను కోల్పోయాం’ అని కన్నీటిపర్యంతమయ్యారు.