- పాలమూరు అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కల్వకుంట్ల కుటుంబం
- మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నవంబర్ 16 (విజయక్రాంతి): అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే విధంగా కల్వకుంట్ల కుటంబ సభ్యుల తీరు ఉన్నదని, పాలమూరు అభివృద్ధిని వారు జీర్ణించుకోలేక పోతున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విమ ర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా కంపెనీని తీసుకువచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. అత్యంత వెనకబడిన ప్రాంతంలో కంపెనీని ఏర్పాటు చేస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడ భూ సేకరణ జరిగిన వందకు వంద శాతం జనం సంతోషంగా భూములు ఇచ్చిన దాఖాలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
రాజకీయంగా లబ్ధి పొందేందుకే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. పాలమూరు పచ్చబడటం అంటే మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు నచ్చడం లేదన్నారు. రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్‌కు భిక్ష పెట్టింది మహబూబ్‌నగర్ జిల్లానే అని గుర్తు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజ యం సాధించడం కేటీఆర్‌కు అసలు నచ్చ డం లేదన్నారు.
గతంలో టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రస్తుతం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనుల్లో టెండర్లు దక్కించుకుంటే ఎలా తప్పుపడుతున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు టెండర్లు దక్కించుకున్న వారే దక్కడం మర్చిపోయి మాట్లాడుతున్నారా ? అని ప్రశ్నించారు.