calender_icon.png 20 September, 2024 | 9:10 AM

జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడే కాదు!

07-09-2024 01:52:48 AM

మాస్కో, సెప్టెంబర్ 6: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చట్టబద్ధంగా ఎన్నికైక వ్యక్తిగా భావించడం లేదని రష్యా తేల్చిచెప్పింది. 2014లో ఉక్రెయిన్‌లో జరిగిన తిరుగుబాటు తర్వాత అక్కడ ప్రజాప్రభుత్వమే ఏర్ప డలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. దీంతో జెలెన్‌స్కీని తాము ఉక్రెయిన్‌కి ప్రెసిడెంట్‌గా గుర్తించడం లేదని పేర్కొన్నారు. నిజానికి ఈ ఏడాది మే 20 తోనే జెలెన్ పదవీకాలం ముగిసింది.

కానీ రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించకూడదని ఆయన నిర్ణయించారు. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడి చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్‌లో సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ..‘మేం ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టామనే విషయం అవాస్తవం. నిజానికి తిరుగుబాటుతోనే కీవ్‌లో యుద్ధం మొదలైంది. అది పూర్తిగా చట్ట విరుద్ధం’ అని కామెంట్ చేశారు. జెలెన్‌స్కీ కాలవ్యవధి ముగియడంతో పార్లమెంట్‌కు అధికారాన్ని అప్పగించి, పదవి నుంచి వైదొలగాలని సూచించారు.