calender_icon.png 13 January, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైనూర్ అష్టదిగ్బంధనం!

06-09-2024 01:59:41 AM

  1. అల్లర్ల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు
  2. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు
  3. ఇరువర్గాలతో వేర్వేరుగా సమావేశం

కుమ్రంభీం ఆసిఫాబాద్/మంచిర్యాల/ఆదిలాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఆదివాసీ మహిళపై లైంగికదాడితో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో స్పెషల్ పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. 144 సెక్షన్ అమ ల్లో ఉండటంతో జనాలెవరూ గుమిగూడకుండా పోలీసులు పహారా కాశారు. అడిష నల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీ చంద్రశేఖర్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలా బాద్ ఎస్పీలు డీవీ శ్రీనివాస్‌రావు, అఖిల్ మహాజన్, అశోక్ కుమార్, గౌస్ ఆలం తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలతో వేర్వేరుగా సమావేశం ఏర్పాటు చేశారు.

అడిషనల్ డీజీ మహేశ్ మాట్లాడుతూ.. ఆదివాసీ మహిళపై దాడి జరగడం బాధకరమని, ఘటనపై ఇరువర్గాల సంయమనం పాటించాలని కోరా రు. అల్లర్లతో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థా యి నివేదిక అందించేందుకు కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్‌ను నియమించినట్టు చెప్పారు. కలెక్టర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. వదంతులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌పై నిషేధాన్ని విధించామని తెలిపారు. ఉట్నూర్ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పర్యటించారు. ఉట్నూర్‌లోని కొమ్రం భీం కాంప్లెక్స్‌లో ఇరువర్గాల పెద్దలతో సమావేశమయ్యారు. 

ఎమ్మెల్యేల హౌస్ అరెస్టు 

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కెరిమెరి వద్ద పోలీసులు అడ్డుకున్నా రు. అక్కడి నుంచి స్పెషల్ ఎస్కార్ట్‌తో ఆమెను ఇంటికి తరలించారు. ఇంటి వద్ద మహిళా పోలీసులను పహారా పెట్టారు. సి ర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబును సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. శాంతిభద్రత రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.   

నిందితుడిని కఠినంగా శిక్షించాలి : కేటీఆర్ 

ఆదివాసీ మహిళపై లైంగికదాడి ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. జైనూర్‌లో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆదివాసీ మహిళకు అండగా ఉంటాం

హైదరాబాద్ సిటీబ్యూరో:  లైంగికదాడికి గురైన ఆదివాసీ మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద భరోసా ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె గురువా రం పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందిం చాలని గాంధీ ఆసుపత్రి వైద్యులకు సూచించారు.