calender_icon.png 13 January, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లష్కరేతో జకీర్ నాయక్

20-10-2024 02:49:45 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు, భారత మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్ పాకిస్థాన్ పర్యటనలో లష్కరే తోయి బా ఉగ్రవాదులతో సమావేశమయ్యాడు. లాహోర్‌లోని బాద్‌షాహీ మసీదు వద్ద జకీర్.. లష్కరే సభ్యులు ముజమ్మిల్ ఇక్బాల్ హాష్మీ, ఫైసల్ నదీమ్, మహ్మద్ హారిస్ తదితరులతో కలసి ఓ జల్సాలో ప్రసగించాడు. కాగా వీరందరిని 2008లో అమెరికా అంతర్జాతీయ టెర్ర రిస్టులుగా ప్రకటించింది.

రాష్ట్ర అతిథిగా నెలరోజుల పర్యటన కోసం సెప్టెంబర్ 30న జకీర్ నాయక్ పాకిస్థాన్‌కు విచ్చేసినట్లు సమాచారం. జల్సాలో భాగంగా లష్కరే తోయిబా ఉగ్రవాదులతో జకీర్ నాయక్ ఆలింగనం చేసుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ముంబైలో 9/11  దాడులు సహా పలు ఉగ్రదాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్లు లష్కరే తోయిబా ఇదివరకు ప్రకటించింన విషయం తెలిసిందే.