శాన్‌ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 16: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యలతో ఆదివారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన మృతితో ఒక్కసారిగా ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంగీత ప్రియులంతా ఆయనకు నివాళి ఘటిస్తున్న వేళ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో ‘అద్భుతమైన క్షణం’ పేరుతో ఆయన చేసిన చిట్టచివరి పోస్ట్ అంద ర్నీ ఆకర్షిస్తున్నది.
శాన్‌ఫ్రాన్సిస్కోలో ని ఓ రోడ్డుపక్కన తీసిన చెట్టు చిత్రం అది. శరదృతువులో ప్రకృతి అందాలకు సంకేతంగా జాకీర్ హుస్సేన్ ఆ చిత్రాన్ని పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ పోస్ట్‌కు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.