05-04-2025 10:13:54 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): జహీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, మాజీ సీడీసీ చైర్మన్ రమాకాంత్ పాటిల్ తో పాటు పలువురు మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శనివారం హైదరాబాద్ లో బీజేపీకి చెందిన నాయకులు బీఆర్‌ఎస్ లో చేరిన్నారు. మాజీ సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్ పాటిల్, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, సీనియర్ నాయకులు సుభాష్ రావు, భూమయ్య, లక్ష్మయ్యతో పాటు ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి హరీష్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిథున్ రాజ్, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.