calender_icon.png 26 December, 2024 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో యువశక్తి బహిరంగ సభ.. అధిక సంఖ్యలో రావాలని పిలుపు

02-12-2024 02:06:22 PM

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ

ముత్తారం, (విజయక్రాంతి): ఈ నెల 4తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే యువశక్తి గళం బహిరంగ సభకు ముత్తారం మండలం నుంచి భారీ ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డు బాలాజీ పిలుపునిచ్చారు.  సోమవారం వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ ఈ నెల 4 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు యువశక్తి గళానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారని, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తారం పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య,  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్, మాజీ సర్పంచులు తూటి రజిత రఫీ, పులిపాక నాగేష్, తాటిపాముల వకులారాణి శంకర్, నాయకులు  కుమారస్వామి, వాజీద్ పాషా, గాదం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.