calender_icon.png 3 February, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువభారతి తెలుగు వెలుగు

03-02-2025 01:15:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): యువభారతి సాహితీ సాం స్కృతిక సంస్థ, నవ్య సాహితీ సమితి సంస్థ సంయుక్తంగా ప్రతినెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న ‘తెలుగు వెలుగు కార్యక్రమం’ నాలుగో సమావేశం ఆదివారం ఖైరతాబాద్‌లోని ఐఐఎంసీ కళాశాల సభా ప్రాంగ ణంలో జరిగింది.

ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్ట ర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాలు నిరంతరం గా నిర్వహిస్తూ భవిష్యత్తులో ప్రపంచ తెలు గు మహాసభలు నిర్వహించే సామర్థ్యాన్ని యువభారతి సంస్థ సాధించాలన్నారు.

ఆచా ర్య ఎస్వీ రామారావు రచించిన ‘శత జయం తి సాహితీ మూర్తులు’ గ్రంథం ఆవిష్కరణ చేసి ఈ పుస్తకం పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసే వారికి చాలా ఉపయోగకరమని, ఇందులో తెలుగు రాష్ట్రాలలో నాలుగు ప్రాంతాలకు చెందిన ఎందరో కవుల గురించి ఉందని పేర్కొన్నారు. తాను ఐఏఎస్ కావడానికి 50 ఏండ్ల కింద సహస్ర పూర్ణచంద్ర సాహితీవేత్త ఎస్వీగారి సాహిత్య పుస్తకాలు తోడ్పడ్డాయని తెలిపారు.

నవ్య సాహితి సమితి అధ్యక్షుడు డాక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ వసంత పంచ మి సందర్భంగా  ఏడుగురు విధుషీమణులతో ‘శారదా విజయం’ సాహిత్య రూపకం ప్రదర్శన నిర్వహించడం ఆనందాన్నిచిందన్నారు.

ఆత్మీయ అతిథి కూర రఘువీర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు ప్రతిజ్ఞ, జాతీ య గీతం పాడటానికి సంశయిస్తున్నారని, దాన్ని తమ కళాశాలలో నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో న వ్య సాహితీ సమితి సమావేశకర్త వేమరాజు విజయ్‌కుమార్, యువభారతి కార్యదర్శి జీడిగుంట, రవీంద్ర,అశ్విని కుమార్, యువభారతి సభ్యులు పాల్గొన్నారు.