బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బూర్గంపాడు యూసఫ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ యూసఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎమ్మెల్యే క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీలలో ప్రతి ఒక్కరు గెలుపే ధ్యేయంగా స్నేహపూర్వకంగా పాల్గొనాలని సూచించారు. క్రీడల వలన ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండవచ్చని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా విద్య, క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు.
ఒక గొప్ప స్నేహితుడు కోల్పోయిన ఆ స్నేహితుడి యొక్క పేరుపై అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న బూర్గంపాడు యూత్ సభ్యులను, టోర్నమెంట్ కి ప్రైజ్ స్పాన్సర్ చేసిన సభ్యులను అభినందించారు. అనంతరం ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, నియోజకవర్గ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, కాంగ్రెస్ నాయకులు మారం వెంకటేశ్వర్ రెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, భజన సతీష్, కైపు శ్రీనివాస్ రెడ్డి, భజన ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, టోర్నీ కమిటీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.