calender_icon.png 15 January, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్ కి చేరిన యూసుఫ్ కప్

15-01-2025 06:48:32 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో గత 17 సంవత్సరాలుగా మిత్రుని జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్నటువంటి యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు క్వార్టర్ ఫైనల్ చేరాయి. గురువారం నాడు 4 క్వార్టర్ ఫైనల్స్ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం రోజున మొదటి ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఫరీద్ 11 కొత్తగూడెం జట్టు 10 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 113 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్కే లెవెన్ మణుగూరు జట్టు 10 ఓవర్ లలో 60 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. బ్యాటింగ్ లో 18 పరుగులు చేసి బౌలింగ్ లో 2 వికెట్లు తీసిన ఫరీద్ ఎలేవన్ కొత్తగూడెం ఆటగాడు వంశీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. రెండవ ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి హరి డ్రై హాట్ కోర్ ఫ్యాన్స్ పాల్వంచ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు గాను 7 వికెట్ల నష్టానికి 61 భారీ పరుగులు చేసింది. 62 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూ స్టార్ అశ్వారావుపేట జట్టు చేజింగ్ లో 6.3 ఓవర్లలో 63 పరుగులు చేసి విజయం సాధించింది.

బౌలింగ్ లో 2 కీలకమైన వికెట్లు తీసిన అశ్వారావుపేట ప్లేయర్ సుబ్బు మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మూడవ ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన పండు స్ట్రైకర్స్ కొత్తగూడెం జట్టు నిర్ణీత ఓవర్ గాను ఐదు వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేసింది. 92 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బ్లూ క్యాప్స్ భద్రాచలం జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 72 పరుగులు చేసి ఓటమి చెందింది. బ్యాటింగ్లో పది పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి బౌలింగ్లో మూడు వికెట్లు తీసిన పండు స్ట్రైకర్స్ ప్లేయర్ నజీర్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. నాల్గవ ఫ్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చేజింగ్ లెవెల్ పాల్వంచ జట్టు నిర్ణీత 10 ఓవర్లకుగాను 7 వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేసింది 76 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన జగన్నాధపురం 9.5 ఓవర్లలో 48 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యి ఓటమి చెందింది. రెండు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసిన అంతర్జామీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్  గెలుచుకున్నాడు.