ఆయన ఆధ్వర్యంలోనే తాత్కాలిక ప్రభుత్వం
బయటి శక్తులవల్లే బంగ్లాలో సంక్షోభం
అమెరికా, చైనా, పాక్ హస్తం ఉండొచ్చు
విదేశాంగ మంత్రి జైశంకర్ అనుమానం
బంగ్లా పరిణామాలపై అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ/ఢాకా, ఆగస్టు 6: సంక్షుభిత బంగ్లాదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశాధ్యక్షుడు షహబుద్దీన్ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన చర్చల్లో నిర్ణయించారు.
కాగా, బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి విదేశీ కుట్రలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న హసీనా ఇటీవల మరోసారి ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం, భారత్‌కు అనుకూలమైన నేతగా ముద్ర పడట ంతో బంగ్లాలో పాగా వేయాలనుకొన్న దేశాలకు మింగుడు పడలేదని, అందుకే కుట్రలు చేసి ఆమెను గద్దె దింపారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజాగ్రహానికి గురై హసీనా సోమవారం భారత్‌కు పారిపోయి వచ్చారు. భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ విదేశాంగమంత్రి జైశంకర్ ఇదే చెప్పారు. ఇటీవల షేక్ హసీనా కూడా ఈ అంశంపై చూచాయగా వెల్లడించారు.
అమెరికాకు నచ్చని హసీనా
ఈ సంక్షోభానికి అమెరికా కుట్రలే కారణమనే వాదన బలంగా వినిపిస్తున్నది. అందు కు కారణాలు లేకపోలేదు. బంగ్లాలో ఎయిర్‌బేస్ కోసం ఓ ‘తెల్లవాళ్ల దేశం’ అనుమతి అడిగిందని, అందుకు తాను ఒప్పుకోలేదని హసీనా ఇటీవల ప్రకటించారు. అది అమెరికానేనని సమాచారం. బంగ్లా ఎన్నికలు పారదర్శకంగా జరుగలేదని యూఎస్ విమర్శలు గుప్పించింది. ఈ పరిణామాలను పరిశీలిస్తే సంక్షోభం వెనుక అమెరికా హస్తం ఉందని ధృవపడుతున్నది.
భారత్‌ను నిలువరించేందుకు చైనా వ్యూహం
భారత్‌ను భౌగోళంగా, ఆర్థికంగా నిలువరించేందుకు బంగ్లా ప్రజలను పాక్, చైనా కలిసి పావులుగా వాడుకొన్నాయనే వాదన ఉంది. హిందూ మహాసముద్రంలోకి తన బలాన్ని, బలగాన్ని విస్తరించాలని చైనా ఎప్పటినుంచో కుయుక్తులు పన్నుతున్నది. అందులో భాగంగానే శ్రీలంకకు అప్పులిచ్చి సంక్షోభంలోకి నెట్టింది. మాల్దీవులను తనవైపు తిప్పుకుని సంక్షోభం అంచున నిలిపిం ది. బంగ్లాలో అదే పనిచేస్తున్నదనే వాదన వినిపిస్తున్నది.
మతమౌడ్యమే పాక్ ఆయుధం
ఒకప్పుడు పాక్‌లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్.. భారత్ కారణంగా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. నాటి అవమానంపై పగ, ప్రతీకార జ్వాల పాక్‌లో ఇప్పటికీ ఉన్నాయని విశ్లేషకులు చెప్తుంటారు. అం దులో భాగంగానే బంగ్లాలో మత ఛాందసవాదాన్ని పెంచి సంక్షోభం సృష్టి ంచిందనే వాదన వినిపిస్తున్నది.
బంగ్లా లో క్రియాశీలంగా ఉన్న జమాతే ఇస్లాం అనే ఛాందసవాద సంస్థ విద్యార్థి విభాగం ఇస్లామి ఛాత్ర శిబిర్ (ఐసీఎస్) రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ఈ విధ్వంసమ ంతా వీరి పనేనని నిఘావర్గాలు తెలిపాయి. ఈ సంస్థను హసీనా ఇటీవలే నిషేధించారు. దీన్ని వెనుక ఉండి నడిపిస్తున్నది ఐఎస్‌ఐ అని భారత నిఘావ ర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
జైశంకర్ కూడా అఖిలపక్ష భేటీలో ఇదే చెప్పారు. దేశంలో తీవ్ర హింస సృష్టించాలని ఐఎస్‌ఐ కొద్దినెలల ముందే నిర్ణయి ంచారని నిఘావర్గాలు తెలిపాయి.‘ హసీ నా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జమాతే సంస్థకు ఈ ఏడాది ప్రారంభంలో ఐఎస్‌ఐ భారీగా నిధులు అంద జేసింది. అందులో అత్యధికంగా పాక్‌లో పనిచేస్తున్న చైనా కంపెనీల నుంచే వచ్చాయి’ అని అనుమానాలున్నాయి.
ప్రతిపక్షానికీ పాత్ర!
బంగ్లా సంక్షోభానికి ఆ దేశ ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని ఖలీదా జి యా కూడా కారణమనే వాదన వినిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు రుజువు కావటంతో ౨౦౧౮ నుంచి ఆమె జైల్లో ఉన్నారు. అయితే, ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రహమాన్ కొన్ని నెలల క్రితం సౌదీ అరేబియాలో ఐఎస్‌ఐతో సమావేశమయ్యారని బంగ్లా నిఘావర్గాలు వెల్లడించాయి.
ఆయన ప్రతిపక్ష బీఎన్‌పీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమావేశం తర్వా త హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లండన్‌లో ప్రణాళిక రచించినట్టు భావిస్తున్నారు. దాదాపు ౫౦౦ ఎక్స్ ఖాతాల ద్వారా షేక్ హసీనా ప్రభుత్వంపై నిత్యం వ్యతిరేక ప్రచారం చేశా రని, వీటిలో కొన్నింటిని పాక్ సైన్యం, ఐఎస్‌ఐ నిర్వహించినట్టు తమవద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని బంగ్లాదేశ్ అధికారులను ఉటంకిస్తూ భారత నిఘా వర్గాలు తెలిపాయి.