న్యూఢిల్లీ: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఆక్లాండ్ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో అల్బానో ఒలివెట్టితో(ఫ్రాన్స్) జతకట్టిన యూకీ 6-4, 6-4తో సాండర్-లూక్ జాన్సన్‌ను ఓడించింది.
ఇక మరో డబుల్స్ ఆటగాడు శ్రీరామ్ బాలాజీ ఓటమితో అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మెక్సికోకు చెందిన రెయిస్ వరేలాతో జత కట్టిన శ్రీరామ్ ప్రిక్వార్టర్స్‌లో 3-6, 6-3, 11-13తో హెలివర్రా-హెన్రీ పాటెన్ చేతిలో ఓటమి చవిచూసింది. డేవిస్ కప్‌లో ఆడనునున్న శ్రీరామ్ బాలాజీ డబుల్స్‌లో రిత్విక్ చౌదరీతో జతకట్టనున్నాడు.