న్యూఢిల్లీ: భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ ఆక్లాండ్ ఏఎస్‌బీ క్లాసిక్ ఏటీపీ 250 టోర్నీలో నాకౌట్ దశకు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబు ల్స్ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ-ఒలివెట్టి (ఫ్రాన్స్ ) జంట 3-6, 6-4, 12-0తో జులియన్-లాయిడ్ గ్లాస్‌పూల్ జోడీపై విజయాన్ని అందుకుంది.
గంటా 21 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను ఓడిపోయిన బాంబ్రీ జంట రెండో సెట్‌లో ఫుంజుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌ను సూపర్ టై బ్రేక్‌లో సొంతం చేసుకొని సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఈ జోడీ అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్-రాజీవ్ రామ్‌ను ఎదుర్కోనుంది.