calender_icon.png 27 September, 2024 | 6:54 PM

రన్నరప్‌గా యూకీ బాంబ్రీ

25-09-2024 12:00:00 AM

చెంగ్డూ (చైనా) : చెంగ్డూ ఓపెన్ టెన్నిస్ టోర్నీ యుకీ బాంబ్రీ-ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ రన్నరప్‌కు పరిమితమైంది. మంగళ వారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బాంబ్రీ జోడీ 4-6, 6-4, 4-10 తేడాతో సాడియో-ఫాబిన్ (ఫ్రాన్స్) మీద ఓడిపోయారు. దాదాపు గంటన్నర పాటు సాగిన పోరులో రెండో సెట్ గెలిచినప్పటికీ అసాధారణ రీతిలో పుంజుకున్న సాడియో జోడీ టైటిల్ ఎగరేసుకుపోయింది.