calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ తరహాలో వైటీడీ బోర్డు

19-03-2025 01:02:12 AM

  1. అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం 
  2. సభలో మొత్తం ఆరు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు 
  3. దేవాదాయ చట్టసవరణ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం
  4. యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ
  5. 18 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): దేవాదాయ చట్టసవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సవరణ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభలోని అన్నిపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం తర హాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వా మి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. టీటీడీ తరహాలో 18 మందితో కూడిన  వైటీడీ ట్రస్ట్ బోర్డు ఉంటుందని, వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలు అని మంత్రి చెప్పారు.

బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, డీఏలు మాత్రం ఉంటాయని తెలిపారు. ఆలయ ఈవోగా ఐఏఎస్ అధికారి ఉంటారని, బోర్డు బడ్జెట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందన్నారు. బో ర్డు ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో విద్యాసంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలను నెలకొల్పి, నిర్వహించనున్నట్లు కొండా సురేఖ వెల్లడించారు.

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వ చ్చే ఆలయాలన్నీ దేవాదాయశాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం యాదగిరిగుట్టకు రూ.200 కోట్లకు పైగా ఆదాయం వస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాతనే యాదగిరిగుట్టలో కోట్లాది రూపాయలతో వసతులు  ఏర్పాటు చేశామని, నిత్యం 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

యాదగిరిగుట్ట ఆలయానికి 1,241 ఎకరాల భూమి ఉందని, ఆ ప్రాంతం టెంపుల్ సిటీగా మారబోతుందని, ఇందులో మూడు మున్సిపాలిటీలు, ఆరు గ్రామాలు విలీనం కానున్నాయన్నారు.  

ఆరు బిల్లుల్లో రెండింటికి ఆమోదం..

తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం మొత్తం ఆరు బిల్లులు ప్రవేశపెట్టారు. అందులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు, తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, ధర్మదాయ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందాయి. తెలంగాణ న్యాయవాదులు సంక్షేమ నిధి సవరణ, తెలంగాణ న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి సవరణ, తెలంగాణ పురపాలక సంఘాలు సవరణతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు చర్చల దశలో ఉన్నాయి.

కాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ, తెలంగాణ న్యాయవాదులు సంక్షేమ నిధి సవరణ, తెలంగాణ న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి సవరణ, తెలంగాణ పురపాలక సంఘాలు సవరణతో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.