calender_icon.png 29 December, 2024 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీడీవోపై దాడి ఘటనలో ముగ్గురు అరెస్ట్‌

28-12-2024 04:47:40 PM

అమరావతి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడులో ఎంపీడీఓ (Mandal Parishad Development Officer ) జవహర్‌బాబుపై వైఎస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జల్లా సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీడీవోపై దాడి ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఎంపీడీవోపై  చేసిన సుదర్శన్‌రెడ్డి, బయారెడ్డి, వెంకట్‌ రెడ్డి దాడి చేశారు. దాడి చేసిన మరో 10 మంది కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ ఛాంబర్(MPP Chamber) తాళం చెవిని పట్టుకున్నారు. తాళాలు ఎంపీపీకి మాత్రమే ఇస్తామని ఎంపీడీఓ నిరాకరించడంతో ఆగ్రహించిన సుదర్శన్‌రెడ్డి, అతని సహచరులు జవహర్‌బాబుపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లె సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కొండారెడ్డి, గాలివీడు సబ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన ఎంపీడీఓను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించారు. సుదర్శన్ రెడ్డితో పాటు అతని సహచరులను అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేశారు. కాగా, జవహర్‌బాబుకు మద్దతు తెలిపేందుకు టీడీపీ(TDP) కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. దాడిని ఖండిస్తూ సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.