calender_icon.png 14 November, 2024 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలి: వైఎస్ షర్మిల

11-11-2024 06:11:51 PM

అమరావతి,(విజయక్రాంతి): వైఎస్పీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఓట్లేసింది అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం తమ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనామని వివర్శించారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశామని షర్మిల చెప్పారు. 

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేకుండా పోయిందని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు ఆగడం లేదు, ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది, బెల్టు షాపుల దందాను అరికట్టలేదు, ఐదు నెలలైనా ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదు, రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే, ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు అన్నారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలన ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. 1994లో  కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితమైన కుంగిపోలేదు.

మీ లెక్క హోదా కావాలని మారం చేయకుండా సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామని గుర్తు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సమస్యలపై టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. 2014లో కేంద్రంలో 44 సీట్లు, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని పేర్కొన్నారు. ఎలాంటి హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించి, నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని షర్మిల తెలిపారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది.  ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేసి ఇంట్లో కాదు, ఇంకెక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండన షర్మిలా మండిపడ్డారు.