calender_icon.png 21 January, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్సార్ మరణం పార్టీకే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని లోటు

02-09-2024 07:12:01 PM

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో 

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు 

కోరుట్ల,(విజయక్రాంతి): వైఎస్సార్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని లోటని వర్ధంతి వేడుకల్లో నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. కోరుట్లలోని జువ్వాడి భవన్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి ఆధ్వర్యంలో పట్టణ, మండల కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ... పేదల పెన్నిధి ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. నిరంతరం ప్రజల  కోసమే పరితపించే వారన్నారు. అలాంటి మహానీయుని కోల్పోవడం తెలుగు ప్రజలకు బాధాకరమైన విషయం అన్నారు.ముఖ్యమంత్రిగా పని చేసి పనితనంతో భారతదేశం చూపు తనవైపు తిప్పుకున్నారని, జనం కష్టసుఖాలను తెలుసు కునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల, రైతుల కష్టాలను చూసి చలించిపోయి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి నిబద్ధతతో కృషిచేసిన వ్యక్తి వైఎస్సార్ అన్నారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం కల అనుకుంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి నిజం చేశారని, ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీపుత్రులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించిన ఘనత వైఎస్ కే దక్కుతుందని అన్నారు.

నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయమని, పండు టాకులకు పింఛన్ల ఇచ్చి వారి ఆకలి తీర్చారని, అన్నంలో ఇందిర మహిళలను పునర్జన్మ ప్రసాదించిన వైఎస్ ను తలుచుకొని నేటికీ కన్నీరు పెడుతున్నారని నర్సింగరావు అన్నారు. దేశానికి వెన్నుముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించి ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారన్నారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల కుటుంబాలు వెలుగులు నింపారని, ఎన్నికల్లో విజయం సాధించి 2004 మే నెలలో సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండు రూపాయలకే కిలో బియ్యం,రైతులకు ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్, సర్వీస్ ట్రిపుల్ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని  ప్రజా రంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించారని జువ్వాడి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, యూత్ నియోజకవర్గ అధ్యక్షులు ఎలేటి మైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల  అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, జిందం లక్ష్మీనారాయణ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అన్నం అనిల్,  పుప్పాల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, శ్రీరాముల అమరేందర్, నేమూరి భూమయ్య, చిట్యాల లక్ష్మీనారాయణ, ఏఆర్ అక్బర్, సదుల వెంకటస్వామి, చిలివేరి విజయ్, తెడ్డు విజయ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.