calender_icon.png 21 December, 2024 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు...

21-12-2024 04:23:00 PM

కూకట్ పల్లి (విజయక్రాంతి): సంక్షేమ సారధి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం కూకట్ పల్లి లో ఘనంగా నిర్వహించారు. బాలాజీ నగర్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ ఐస్ క్రీమ్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు మేధావుల ఫోరం అధ్యక్షులు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల ఐ టి వింగ్ అధ్యక్షుడు సునీల్ రెడ్డిలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు.

అనంతరం వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, రైతులకు అండగా నిలిచి రైతు భరోసాని అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె అన్నారు. విద్యా వ్యవస్థలో రూపురేఖలు మార్చి విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలుపరిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అప్పుడే కూకట్పల్లి బాలాజీ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున అధినేత జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైయస్సార్సీపి ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు పెసర్లంక రమణ, వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.