అమరావతి: పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే జగన్ పిఠాపురం చేరుకున్నారు. ఏలేరు ముంపు ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది. ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాలను పరిశీలించిన అనంతరం బాధితులని పరామర్శించేందుకు వైఎస్ జగన్ పిఠాపురానికి వెళ్లారు. జగన్ ని చూసేందుకు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, భారీగా తరలివచ్చారు.