calender_icon.png 27 September, 2024 | 6:54 PM

నన్ను తిరుమలకు వెళ్లనివ్వడం లేదు: వైఎస్ జగన్

27-09-2024 04:36:09 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లడ్డూపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతి ఆలయ దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఓవైపు తనను, మరోవైపు వైసీపీ శ్రేణులను తిరుమలకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమల తెప్పిస్తున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని జగన్ విమర్శించారు. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని చెప్పారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని వెల్లడించారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రోటీన్‌గా జరిగే కార్యక్రమం అన్నారు. 100 రోజుల పాలనను డైవర్ట్‌ చేయడానికే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని జగన్‌ విమర్శించారు.

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ పేర్కొన్నారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులున్నాయన్నారు. నోటీసులు ఇచ్చి.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. దేశంలో ఎక్కడా చూడని పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్‌ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లడ్డూపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతి ఆలయ దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆలయ ఆచారాల్లో భాగంగా ఆయన ఆలయాన్ని సందర్శించనున్నారు.