calender_icon.png 24 September, 2024 | 6:04 AM

యూట్యూబ్ చానెళ్లకు గుర్తింపు అవసరం

24-09-2024 12:42:00 AM

ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పత్రికలు, టీవీ చానెళ్లలా.. యూట్యూబ్ చానెళ్లకూ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్ గుర్తింపు అవసరమని, ఆయా చానళ్లు కంపెనీ యాక్ట్ కింద నమోదు కావడం ముఖ్యమని ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో సోమవారం ఆయన అధ్యక్షతన ‘యూట్యూబ్ చానెల్స్ అక్రిడేషన్ ’అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూస్ వెబ్‌సైట్లకు కూడా అలాంటి నిబంధనలే వర్తిస్తాయన్నారు.

భావస్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి జర్నలిజం ఉంటే బాగుంటుందన్నారు. అందుకు అనుగుణంగా యూట్యూబ్ చానెళ్లు వ్యవహరించాలన్నారు. సమావేశంలో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్, ఎమ్మెల్సీ ఆమెరలీ ఖాన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి, మీడియా అకాడమీ పూర్వాధ్యక్షుడు అల్లం నారాయణ, సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు దిలీప్‌రెడ్డి పాల్గొన్నారు.