25-03-2025 11:07:04 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల టకారియానగర్ లో మంగళవారం సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా ఏడుగురు యువకులు బహిరంగంగా మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టబడ్డారు. పట్టుబడ్డ వారిలో పెట్టెం అశోక్(బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కాలనీ), బాదావత్ రమేష్ నాయక్(బెల్లంపల్లి రడంబాల బస్తి), కోవకుల సాయికుమార్ (బెల్లంపల్లి బస్తి), లావుడియా సాయికుమార్ (బెల్లంపల్లి రడగంబాల బస్తి), బెడ్డల అఖిల్ (బెల్లంపల్లి కాల్ టెక్స్), దార కౌశిక్ (బెల్లంపల్లి కాల్ టెక్స్), జన్నారపు అఖిలేష్ (బెల్లంపల్లి కాల్ టెక్స్) లు ఉన్నట్లు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపారు. వీరికి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.