09-04-2025 12:00:00 AM
బంధీలుగా భూపాలపల్లి, కరీంనగర్‌కు చెందిన నలుగురు!
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన వైనం
విడిపించాలని కుటుంబాల వేడుకోలు
కాటారం, ఏప్రిల్ 8: మయన్మార్ దేశ భద్రత బలగాల చేతిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు బంధీలుగా చిక్కుకున్నారు. మహముత్తారం మండలం నిమ్మగూడెం అజ్మీర సంతోష్, దొబ్బలపాడుకు చెందిన లావుడ్య విజయ్ అనే ఇద్దరు యువకులు నకీలు ఏజెంట్‌ను నమ్మి మోసపోయారని, తమ కుమారులను కాపాడాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. విదేశాల్లో ఉద్యోగా లు కల్పిస్తామని నమ్మించిన ఏజెంట్‌తో కలి సి గత మూడు నెలల క్రితం ఇద్దరు యువకులు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌కు వెళ్లారు. తీరా వెళ్లాక వారి పాస్‌పోర్ట్, సర్టిఫికేట్లు తీసుకుని, మయన్మార్ తరలించి, అక్క డ రెండు నెలలు పనిచేయించుకున్నాడు.
ఒకనెల డబ్బులు మాత్రమే చెల్లించి అక్కడి నుం చి ఏజెంట్ ఉడాయించాడు. ఈ క్రమంలో మయన్మార్ ఆర్మీకి చిక్కారు. ఈ ఇద్దరితోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు యువకులను అక్కడి బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. తమవారిని విడిపించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి యువకుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బం ధీలుగా ఉన్న యువకులు నెల రోజులుగా స రైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని, పొట్టకూటి కోసం దేశం గాని దేశానికి వెళ్లిన తమ కుమారులు తిరిగి స్వదేశానికి వస్తారో రారో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ బిడ్డలను కాపాడి, తమ వద్ద కు చేర్చాలని వేడుకుంటున్నారు.