21-04-2025 01:24:39 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): ఈ నెల 27 న ఎల్కతుర్తి, వరంగల్(Warangal BRS Sabha)లో జరగనున్నా రజతోత్సవ బహిరంగ సభ కోసం ఆర్థిక అవసరాల నిమిత్తం నిధులు సమకూర్చుటకు అశ్వాపురం మండలం యువజన విభాగం(Aswapuram Mandal Youth Department) అధ్వర్యంలో ఈదర సత్యనారాయణ రైస్ మిల్లులో హమలి పని చేసి వినూత్న రీతిలో నిధులు సమకూర్చిన యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ రథసారధి, కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంత్యంత వైభవంగా నిర్వహించబోతున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు నిధులు సమకుర్చుటకు పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ని ఆదర్శంగా తీసుకుని ,యువజన విభాగం అధ్వర్యంలో హమలీ పని చేసి కొంత నిధులను సమాకూర్చడం జరిగింది.
కెసిఆర్ హయంలో తెలంగాణ పురోగమన పాలన జరిగితే, కాంగ్రెస్ పాలనలో తిరోగమన పాలన నడుస్తుంది. అందుకు వరంగల్ లో జరిగే బహిరంగ సభకు ,కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా మండలంలోని ప్రతి గూలాబి సైనికులు స్వచ్ఛందంగా సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, నజీర్ షోను, చల్లా రాజు, బాగోతపు సతీష్, వల్లెపోగు రాము, మడిపల్లి రమేశ్, కొమ్ము రాంబాబు, మందా రాంబాబు, శెట్టిపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.