ఉజ్వల భవిష్యత్తుతో కన్న తల్లిదండ్రులకు, కుటుంబానికి అండ గా ఉండాల్సిన తెలంగాణ యువత మునుపెన్నడూ లేని విధంగా నేడు గంజాయి మత్తులో ఊగుతూ వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకొంటున్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర యువత గంజా యి మత్తులో తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. గంజాయి నేడు పాన్ షాపులు, కిరాణా షాపులలోసైతం విచ్చలవిడిగా లభ్యమవుతోంది. నిరుపేద, మధ్యతరగతికి చెందినవారి పిల్లలు ఆక తాయిలతో కలిసి నిర్మానుష్య ప్రదేశాలలో గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొందరు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థ్ధులను లక్ష్యంగా చేసుకొని కళాశాలలకు సమీపంలో గంజాయిని విక్రయిస్తూ విద్యార్థుల ఉజ్వల భవి ష్యత్తును అంధకారంలోకి చెడగొడుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభు త్వం మొద్దు నిద్రను వీడి మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
వావిలాల రాజశేఖర్ శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా