calender_icon.png 16 January, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి ఆత్మహత్య

03-07-2024 12:05:00 AM

కూకట్‌పల్లి, జులై2 : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా  జుజ్జూరుకు చెందిన కొత్త వెంకట భాను శంకర్ సాయిరాం చౌదరి (28) కేపీహెచ్‌బీ కాలనీ ఫేస్ 3లోని ఎంఐజీ ప్లాట్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఉద్యోగం లేక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దీంతో తాను నివసిస్తున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.