calender_icon.png 29 December, 2024 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి ఆత్మహత్య..

28-12-2024 09:52:18 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... రాంపూర్ గ్రామానికి చెందిన కాశిరెడ్డి సాయికృష్ణ అలియాస్ (బబ్లు) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం రోజున కడుపునొప్పి తీవ్రం కావడంతో సాయికృష్ణ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ కాశిరెడ్డి రాజు -రేణుకకు ఏకైక కుమారుడు కావడంతో వారి కుటుబం శోకాసముద్రంలో మునిగిపోయింది. తండ్రి కాశిరెడ్డి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పట్టణ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు.